ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
సివిల్ సప్లై డీఎంను ఆదేశించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల మే 14 : నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ళ ను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రవి నాయక్ ను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదనే ఫిర్యాదులు తన దృ ష్టికి రావడంతో బుధవారం సాయంత్రం ఈ విషయం గురించి ఎమ్మెల్యే సివిల్ సప్లై డీఎంతో ఫోన్ లో మాట్లాడారు.
అన్ని మండలాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోళ్ళ ను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా సివిల్ సప్లై డిఎం రవి నాయక్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.






