18 April, 2026 | 9:34 AM

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

15-05-2025 01:05 AM

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక

భూత్పూర్, మే 14 : చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన లేదని, అలాంటి వారికి చట్టాల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు.  వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి మృతి చెందుతున్నారన్నారు. యువకులు మద్యం సేవించి అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

గొడవల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే కోర్టులో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ గ్రామాలలో చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. చిన్న చిన్న గొడవలు పడి కేసులు పెట్టుకుంటున్నారన్నారు. అలాంటివారు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవాలన్నారు. రెండు కుటుంబాల మధ్య సమస్య వస్తే ఎవరి వద్దకు వెళ్లాలో తెలిసేది కాదని , కోర్టులోనే సమస్యలను పరిష్కరించే విధంగా న్యాయ సేవా అధికార సంస్థను ఏర్పాటు చేసిందన్నారు.

వాహనాలు నడిపే వారు తప్పకుండా లైసెన్స్, హెల్మెట్లు ఉండే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జయలక్ష్మి, ఎంపీడీవో ప్రభాకర్ చారి, జడ్చర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాలిక్ సాకీర్, ఎస్త్స్ర చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్ , నాయకులు మురళీధర్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, విజయ్ గౌడ్, అజీజ్, మచ్చేందర్ తో పాటు తదితరులు ఉన్నారు.