15-05-2025 01:00:47 AM
అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్ నగర్ మే 14 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలో చౌడేశ్వరి మాత బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ప్రత్యేకంగా ర్యాలీతో అమ్మవారి సన్నిధికి చేరుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆ నంద్ గౌడ్, పాలకొండ బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, గోపాల్ పాల్గొన్నారు.