6 April, 2026 | 11:19 AM

నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ‘ఆప్’ నిరసన దీక్ష

29-06-2024 01:56 AM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, జూన్ 28: (విజయక్రాంతి) : బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని దోమలగూడ లిబర్టీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల యం ఎదుట ఆప్ పార్టీ కార్యకర్తలతో నిరసన దీక్ష చేపడతామన్నారు. అర్వింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఆ మరుసటి రోజే ఈడీ హైకోర్టుకు చేరుకొని కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే తీసుకుందన్నారు. రెండేండ్లుగా గాఢ నిద్ర నుంచి మేల్కొన్న సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసులో బెయిల్‌పై హైకోర్టు నిషేధం హైకోర్టు ఎత్తివేయనుందన్నారు.