calender_icon.png 11 February, 2026 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే అభ్యర్థుల ఐదేండ్ల భవితవ్యానికి పరీక్ష

11-02-2026 12:34:59 AM

  1. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

నేడు ఏడు నుంచి ఐదు గంటల వరకు జరగనున్న పోలింగ్ - పోలింగ్ కు సర్వం సిద్ధం,13న ఫలితాలు 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : ఐదేండ్ల అభ్యర్థుల భవితవ్యానికి నేడు పరీక్ష (పోలింగ్ ) జరగనున్నది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కార్పొరేట్ ఎన్నికలు జరగనుండగా, దేవరకద్ర,భూ త్పూర్ మున్సిపాలిటీలకు కౌన్సిలర్ల ఎన్నిక జరుగుచున్నది.

పాలమూరులో 58వ డివిజన్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక ఏకగ్రీవం కాగా మిగిలిన 59 డివిజన్లకు, దేవరకద్ర మున్సిపాలిటీలో 12 కౌన్సిలర్ అభ్యర్థులకు, భూ త్పూర్ మున్సిపాలిటీలో 10 మంది కౌన్సిలర్ల ఎన్నిక ప్రక్రియ ను సంబంధిత అధికార యంత్రంగం సర్వం సిద్ధం చేసింది. 

 పోలింగ్ సామాగ్రి కేంద్రాల పరిశీలన..

సాధనణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించారు. మహ బూబ్ నగర్ కార్పొరేషన్ లో 194541, దేవరకద్ర 10070, భూత్పూర్ 12604 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు.

ఇతర ప్రాంతంలో ఉన్న ఓటర్లను సైతం రప్పించిందికు అభ్యర్థులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉండడంతో ఓటింగ్ శాతం కూడా కొంతమేరకు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది. ఈనెల 13వ తేదీన కౌంటింగ్ పూర్తిచేసి విజేతలను సంబంధిత ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.