21 March, 2026 | 8:19 AM

డౌన్ సిండ్రోమ్‌కు బదులిద్దాం

21-03-2026 01:32 AM

నేడు డౌన్ సిండ్రోమ్ దినోత్సవం

క్రోమోజోమ్స్ లోపం వల్ల కలిగే శారీరక మానసిక క్షీణతకు చెందిన వ్యాధిని డౌన్ సిండ్రోమ్ అంటారు. బ్రిటీష్ వైద్యుడు జాన్ లాంగ్డన్ డౌన్ చేసిన విశేష కృషి ఫలితంగా ఈ ప్రత్యేక వ్యాధికి ఆయన జ్ఞాపకార్థం డౌన్ సిండ్రోమ్‌గా నామకరణం చేశారు. సాధారణంగా మానవ శరీరంలోని క్రోమోజోమ్స్ 21లో రెండేసి పోగులు ఉండటానికి బదులు అసాధారణం గా మూడు పోగులు ఉండటం వల్ల దీనిని వైద్య పరిభాషలో ట్రైసోమీ అని పిలుస్తారు.

ఇలాంటి వారిలో సాధారణంగా ఉండాల్సిన ఐక్యూ 100కు బదులుగా 50 వరకు మాత్రమే ఉండటంతో శారీరక మానసిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. ఈ వ్యాధిని తల్లి గర్భంలోనే గుర్తించే అధునాతన సాంకేతికత నేడు అందుబాటులో ఉండటంతో వైద్యులు పరీక్షల అనంతరం అవసరమైతే అబార్షన్లను కూడా సూచిస్తున్నారు. డౌన్ సిండ్రోమ్ దీతిజిజితో బాధపడుతున్న వయోజనులు కూడా పదేళ్ల లోపు పిల్లల వలె ప్రవర్తించడం వీరిలో గమనించదగ్గ ప్రధాన అంశం. జీవితాంతం శాపం గా మారగల ఈ వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించడానికి ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినంగా పాటించడం 2012 నుంచి నిరంతరాయంగా కొనసా గుతోంది.

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్స వం 2026 ఇతివృత్తంగా ‘ఒంటరితనానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం’ అనే అంశాన్ని తీసుకొ ని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. గణాంకాల ప్రకా రం డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 33 శాతం వరకు న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తుతుండగా 50 శాతం రోగుల్లో వినికిడి లోపాలతో పాటు దృష్టి దోషాలు కూడా నమోదవుతున్నాయి. మానసిక క్షీణత, శారీరక పెరుగుదల మందగించడం, చిన్న చేతులు, చిన్న గడ్డం, 

పొట్టి మెడ, మాట తడబడటం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పెద్ద నాలుక, అసాధారణ ఆకృతిలో ఉండే చెవులు, మెడ వెనుక చర్మం అధికంగా పెరగడం, కండరాల బలహీనత, పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు వీరిని నిరంతరం వేధిస్తుంటాయి. ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించడా నికి క్రోమోజోమ్స్ విశ్లేషణ, ఎక్స్ రే, రక్త పరీక్షలు, క్వాడ్ స్క్రీన్, అల్ట్రా సౌండ్, డీఎన్‌ఏ పరీక్ష లు నిర్వహిస్తారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగుల్లో సమస్యలు కొంతవరకు తగ్గుతాయని తల్లిదండ్రులు గ్రహించాలి. డౌన్ సిండ్రోమ్ ఉచ్చులో చిక్కిన అన్ని వర్గాల అభాగ్య రోగులకు సమాన హక్కులు, వైద్య ఆరోగ్య సహాయాలు, ఉచిత విద్య, సమాజంలో గౌరవ మర్యాదలు కల్పించే విధంగా పౌర సమాజం మేల్కొనాలి.

ప్రతి వెయ్యి మంది శిశువుల్లో ఒకరు ఇలాంటి సమస్యలతో జన్మిస్తున్న నేటి కాలంలో పుట్టకముందే వ్యాధిని గుర్తించే ప్రయత్నాలు చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. సామాజిక వివక్షను వీడి వీరిని మనలో ఒకరిగా ఆదరించినప్పుడే నిజమైన మానవత్వం పరిఢవిల్లుతుంది. ప్రభుత్వం సైతం ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు సరైన కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. అప్పుడే ఈ అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడం సాధ్యమవుతుంది.

 సెల్:9949700037