18 March, 2026 | 3:45 AM

భట్టి పాదయాత్రకు నేటితో మూడేళ్లు

18-03-2026 12:35 AM

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇచ్చిన హామీల్లో చాలా మేరకు నోచుకొని హామీలు

ఉట్నూర్, మార్చి 17 (విజయక్రాంతి):  సీఎల్పీ నేతగా ప్రజల సమస్యలను తెలుసుకుం టూ.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయా త్ర జిల్లాలో నిర్వహించి ఏడాది పూర్తి అయిం ది. బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుండి మార్చి 16న శ్రీకారం చుట్టిన పాదయాత్ర ఉట్నూర్ ఏజెన్సీలో చేరుకుని నేటితో మూడేళ్లు అయింది.  ఇచ్చోడ, సిరికొండ మం డలాల మీదుగా ఏజెన్సీ మండలాలైన  ఇంద్రవెల్లిలో  మార్చి 18న  పాదయాత్ర చేపట్టారు.

ఉట్నూర్ ఏజెన్సీలోని  ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో పర్యటి స్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో ప్రజలు ఆయన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తూ  పాదయాత్రను ముందుకు సాగించా రు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు ఆరు మండలాలకు మధ్యలో ఉన్న ఇంద్రవెల్లిలో  50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు పక్కన కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాన్ని స్వయంగా పలకరించి ఇంటి స్థలం తో పాటు  ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన, నేటికీ మంజూరు కాలేదు. ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు లోని  త్రివేణి సంగమం ప్రాజెక్టు నీరు రైతులకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటానని  హామీ ఇచ్చిన నేటికీ కార్యరూపం దాల్చలేదు. త్రివేణి సంగం ప్రాజెక్టు నీరు రైతులకు అందే విధంగా  నీటిపారుదల శాఖ అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన నేటికీ మంజూరు చేయడం లేదు.

ఇంద్రవెల్లి మండలం తోపాటు ఉట్నూర్ మండలంలో  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగావ్ వాగు పై ప్రాజెక్టు నిర్మించి ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.. కానీ హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క తో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చర్యలు తీసుకుంటారని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఎదురుచూస్తున్నారు.