రహదారిపై ఆశా కార్యకర్తల ధర్నా
నిర్మల్, మార్చి ౧7 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిం చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు 48 గం టల దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న ఆశ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం జాతీయ రహదారిపై ఆర్డిఓ కార్యాలయం వద్ద గంటసేపు ఎండలో కూర్చున్న
ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ విషయా న్ని తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అక్కడికి చేరుకొని వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత సురేష్ చంద్రకళ రాజమణి ఉన్నారు.
సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా
నస్పూర్, మార్చి 17 : ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం కలెక్టరేట్ ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ సమ్మక్క తో కలిసి మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న జీతాలు,
లెప్రసీ, ఎండిఏ డబ్బులు చెల్లించాలని, ఏఎన్సి టార్గెట్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అనితకు వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియ న్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శోభ, జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మ, భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




