17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నేడు కొర్విపల్లికి పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాక

28-01-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

మెదక్, జనవరి 27 (విజయ క్రాంతి) :జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ గారి పేరు తోలగించడాన్ని ఖండిస్తూ బుధవారం ఉదయం 10:00 గంటలకు మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కొర్విపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ముఖముఖిగా మాట్లాడడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.

20 సంవత్సరాల క్రితం, పార్లమెంట్లో సమ్మతితో MGNREGA చట్టాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆమోదించరని గుర్తుచేశారు. అది ఎంతో విప్లవాత్మకమైన అడుగు అని, దాని ప్రయోజనాలు కోట్లాది గ్రామీణ కుటుంబాలకు చేరాయిని ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వారు, అత్యంత పేద ప్రజలకు ఇది జీవనాధారంగా మారిందాని అన్నారు.

MGNREGA పథకాన్ని కాపాడుతూ, కార్మికుల హక్కులు, ఉపాధి భద్రత కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కరారు. ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి ఎంపీటీసీలు, బ్లాక్ మండల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు కార్మికులు కర్షకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.