calender_icon.png 29 September, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్టర్ సోహాని కుమారి కాబోయే భర్త ఆత్మహత్య

29-09-2025 09:48:00 AM

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో టాలీవుడ్ యాక్టర్ సోహాని( Sohini Kumari) కుమారి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్‌కు చెందిన సవాయి సింగ్‌తో సోహాని నిశ్చితార్థం జరిగింది. సవాయి సింగ్ సోహాని కుమారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సోహాని టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. సోహాని, సవాయి నగరంలోని ప్రశాసన్ నగర్‌లో(Prashasan Nagar) కలిసి ఉంటున్నారు. సవాయి సింగ్‌ తన ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తప్పు చేశానని, ఆ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నా అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలుసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం సవాయి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.