29-09-2025 10:07:18 AM
హైదరాబాద్: హైదరాబాదీలు పల్లెబాట పట్టారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్( JBS Bus Station) లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బతుకమ్మ, దసరా పండగకు ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. కుటంబ సమేతంగా నగరం నుంచి సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ప్రయాణిలకు రద్దీ దృష్ట్యా టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులు(TGRTC special buses) నడుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లేందుకు ప్రజలు జేబీఎస్ కు క్యూ కడుతున్నారు.
అటు మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్(MGBS Bus Station) నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7,754 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రత్యేక పండుగల సందర్భంగా టికెట్ రేట్లను సవరించుకోవచ్చు. ఇందుకోసం 2003 లోనే అప్పటి ప్రభుత్వం జీవో 16 తెచ్చిందన్నారు. ఆ జీవో ప్రకారమే ఇప్పుడు కూడా టికెట్ రేట్లను సవరించామని, స్పెషల్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. టికెట్ రేట్లపై ఎలాంటి అపోహలను నమ్మొద్దు సజ్జనార్ తెలిపారు.