15 April, 2026 | 11:57 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

జీహెచ్‌ఎంసీని ముట్టడించిన టోమో

21-02-2026 02:18 AM
  1. కొత్త అడ్వర్టైజింగ్ పాలసీతో 450 ఏజెన్సీలు, 50 వేల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు 
  2. ప్రైవేట్ భవనాలపై హోర్డింగ్స్ కొనసాగించాలి 
  3. తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ అవుట్ డోర్ మీడియా రంగంపై ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త అడ్వర్టైజింగ్ పాలసీ విధానం వల్ల వందలాది చిన్న ఏజెన్సీలు మూతపడి వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

ఏజెన్సీ నిర్వాహ కులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. మున్సిపల్ శాఖ బాధ్యతలు సీఎం వద్దే ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా తమ సమస్యలను ఆయన దష్టికి తీసుకెళ్లేందుకు అపా యింట్మెంట్ దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పాలసీ కేవలం రెండు మూడు బడా కంపెనీలకు మేలు చేసేలా ఉందని టోమో ప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 450కి పైగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉన్నా యి. వీటిపై సుమారు 50 వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి.

కొత్త నిబంధనల వల్ల వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమా దం ఉంది అని వారు వాపోయారు. ప్రైవేట్ భవనాల పైన, ప్రైవేట్ భూముల్లో ఏర్పాటు చేసే వేలాది హోర్డింగ్స్‌ను తొలగించి, కేవలం ఆర్ అండ్ బి రోడ్ల పక్కన ప్రభుత్వ భూము ల్లో మాత్రమే ప్రకటనలకు అనుమతి ఇవ్వ డం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో పన్నులు లేకుం డా కేవలం కొన్ని ఏజెన్సీలకే వ్యాపార అవకాశాలు కల్పించడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. .

మధ్యవర్తుల మాటలు కొందరు బడా పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన పారదర్శకమైన పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వారు కోరారు. చిన్న ఏజెన్సీలను రక్షిస్తూనే, నగర అందానికి విఘాతం కలగకుండా తగి న జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాన్ని వెన క్కి తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం అసోసియేషన్ బాధ్యులు, ఏజెన్సీ యజమానులు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.