2 April, 2026 | 3:21 AM

విద్యారంగానికి పెద్దపీట!

02-04-2026 12:00 AM

విద్యా వ్యవస్థను ఒక్కరోజులో సంస్కరించడం అంత తేలికకాదు. అయినప్పటికీ పక్కా ప్రణాళికలతో సంకల్ప దీక్షతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య విరబూసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకంతో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో రాజీపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. 

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా మాట ల్లో ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. విద్య అనేది వ్యక్తిగత వికాసానికి ఒక గొప్ప చోదక శక్తి. విద్య ద్వారానే ఒక రైతు కూతురు డాక్టర్ కాగలదు, ఒక గని కార్మికుడి కొడుకు గని అధిపతి కాగలడు, ఒక వ్యవసాయ కూలీ బిడ్డ ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు కాగలడు.

మనకు ఇవ్వబడిన దానితో కాదు, మనకు ఉన్న దానితో మనం ఏమి సాధిస్తామనేదే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుంచి వేరు చేస్తుంది. దక్షిణాఫ్రికా గాంధీ మండేలా  స్పూర్తితో స్వయా నా విద్య శాఖ పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ మార్గదర్శకంలో దేశంలోని ఇతర రాష్ట్రాల తో పోలిస్తే విద్య రంగం పురోగతి సాధిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపెట్టి ఎగనామం పెట్టె ప్రభుత్వాలను ఎన్నింటినో చూసాం, కానీ విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చిస్తున్న నిధులను ఖర్చుగా బావించడం లేదంటే రేవంత్ ప్రభుత్వ సంకల్పం అర్థం చేసుకోవచ్చు. 

పాఠశాలల్లో కనీస వసతుల కల్పనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు సోషియో ఎకనామిక్ 2026 నివేదికలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కేవలం 6.9 శాతం పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు ఉండగా తెలంగాణలో 85.7 శాతం పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని, అలాగే కం ప్యూటర్ ల్యాబ్ వాటిలో దేశవ్యాప్తంగా 57.9 శాతం ఉంటే రాష్ట్రంలో 81.2 శాతం ఉన్నాయని గణాంకాలు చెప్పుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యుగంలో తెలంగాణ విద్య వ్యవస్థ పురోగతి సాధిస్తున్న నమ్మకం అందరిలో ఉం ది. రాష్ట్రంలో తాగునీటి సదుపాయం లేని స్కూల్ లేదంటే అతిశయోక్తి కాదు.

కొత్త విద్యా వ్యవస్థకు అంకురార్పణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో వార్షిక బడ్జెట్ 2026 విద్యారంగానికి పెద్దపీట వేసారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26,674 కోట్లను ప్రతిపాదించింది. అయితే ప్రాథమిక విద్యా, ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులలో సర్కార్ విద్యను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు విస్తృతంగా కృషి చేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే.. ఒకశాతం లోపు పెరుగుదల కన్పించింది. విద్యార్థులకు సక ల వసతులు, ఉచిత రవాణా సౌకర్యం, ఇంటర్మీడియట్‌లో బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్‌తో పాటు నిర్బంధ విద్య అందించాలనే తపనతో  ప్రభుత్వం కృషి చేస్తున్నది.

ఎన్నికల సమయంలో ఎలాంటి వాగ్దానా లు కాకుండా ప్రగతిపద్దులో ఏకంగా రూ. 135.88 కోట్ల నిధులు కేటాయించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విద్యా వ్యవస్థకు అంకురార్పణ చేస్తూ ఆచరణలో గణనీయమైన ఫలితాలను రాబట్టింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితా ల్లో అసాధారణ ప్రతిభచాటారు.

2024 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో 83.17 శాతం, మొదటి సంవత్సరంలో 78.15 శాతం ఉత్తీర్ణత, 11బీసీ గురుకుల కళాశాల్లో వందశాతం ఫలితాలు సాధించి రికార్డ్ సృష్టించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.

పోటీ ప్రపంచంలో ఒక వైపు ప్రైవేట్‌లో చదవలేక ఆర్థిక భారంతో సర్కార్ బడుల్లో చేరితే అంతంత మాత్రం వచ్చిన ఫలితాల తో సన్నగిల్లిన నమ్మకం వల్ల నిరాశ చెంది చదువుకు దూరం కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా తీర్చిదిద్దె ప్రక్రియ వేగవంతం అయ్యింది.

నూతన విద్యా విధానం అమలు దిశగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. 2020లో ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని 2026 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ సిఫార్సులు కొంత ఉపాధ్యాయిలను గందరగోళంలో పడేసింది.

అయితే ఈ నివేదిక లో కొన్ని సవరణలు చేస్తే, లోటుపాట్లను సరిదిద్దటానికి, నూత న ఒరవడికి దారితీయాలనే ఉద్ద్యేశం విద్యా ప్రమాణాలు పెంచడానికి నివేదిక దోహదపడుతుందనే భావించాలి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులం దరూ ఒకే ప్రాంగణంలో చదువుకునేలా, వారి మధ్య సామాజిక బాధ్యతను పెంచేవిధంగా, ఐక్యత కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ జిల్లా మినహా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజా బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించింది.

అందులో 79 స్కూల్స్ పాలన పరమైన అనుమతులు పొంది నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. ప్రధానంగా పేద విద్యార్థులు ఇంట ర్మీడియట్ చదువుకొనలేక ప్రభుత్వ కళాశాలకు రాలేక చదువు మానేసి తల్లిదం డ్రులకు భారం కాకూడదని స్వయానా విద్యా శాఖ చూస్తున్న సీఎం రేవంత్ ప్రత్యే క చొరవ తీసుకుని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకరావడనికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. 

విద్యారంగంపై దార్శనికత..

దేశమంతా 10+2 విద్యా విధానం అమల్లో ఉందని గమనించిన ప్రభుత్వం తెలంగాణలో చదివిన ప్రతి విద్యార్ధి దేశ వ్యాప్తంగా చదువుకునే విధంగా తీర్చిదిద్దడానికి, విద్యా, వ్యవస్థలో మార్పు తీసుకు నేందుకు కసరత్తు మొదలు పెట్టారు. వాస్తవానికి విద్యా వ్యవస్థను ఒక్కరోజులో సం స్కరించడం అంత తేలిక కాదు. అయినప్పటికీ పక్కా ప్రణాళికలతో సంకల్ప దీక్షతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకుసాగుతున్నది.

తెలంగాణ పునర్నిర్మాణం లో విద్య విరబూసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకంతో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో రాజీపడకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అభివృద్ధి పథంలో నడిపించే దిశగా విశ్వవిద్యాలయాలకు సైతం ప్రగతి పద్దులో మూడు రేట్లు కేటాయించింది.

వందేండ్ల చరిత్ర గల ఉస్మానియాకు రూ.1000 కోట్లు, మహిళా యూనివర్సిటీకి రూ.400కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగ అభివృద్ధిపై తన దార్శనికతను చాటుకున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్, గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ప్రతిరోజూ అల్పాహారం మొదలుకొని మధ్యా హ్న భోజనం వరకు కడుపు మాడ్చుకోకుండా విద్యార్థులు ఇష్టంగా చదువుకోవ డానికి రోజుకో వెరైటీ ప్రతి వారం మెనూ వడ్డించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

2026 విద్య సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మిడ్డే మీల్స్ స్కిం అమలుతో 1.30 లక్షల విద్యార్థులకు లబ్ధి జరుగనుం ది. గత ప్రభుత్వం 2020లో ప్రకటించినప్పటికి అమలు చేయలేదు. ప్రభుత్వం కోరుకున్నట్లు వంద కు 100 శాతం ఫలితాలు సాధించాలనే సం కల్పంతో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన భోజనంతోపాటు, విద్యార్థుల సం క్షేమాన్ని పరిరక్షించడానికి, నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం విద్య ప్రమాణాలు పెంచ డానికి చేస్తున్న కృషి రేవంత్ ప్రభుత్వానికి విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న ఆకాంక్షకు దర్పణం పడుతున్నది.

 వ్యాసకర్త సెల్: 98662 55355