2 April, 2026 | 3:20 AM

కుల అస్తిత్వం నుంచి అధికారం వైపు

02-04-2026 12:00 AM

పద్మభూషణ్ గ్రహీత, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆంధ్రే బెటీల్ (1934 భారతీయ సమాజం, ముఖ్యంగా కుల వ్యవస్థ, అసమానతలు సామాజిక మార్పులపై లోతైన పరిశో ధనలు చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఐదు దశాబ్దాలు బోధన, పరిశోధనలు చేసిన ఆయన 2026 ఫిబ్రవరి 3న పరమపదించారు. క్యాస్ట్ క్లాస్ అండ్ పవర్: చేంజింగ్ ఫ్యాట్రాన్ ఆప్ స్ట్రార్టిఫికేషన్ ఇన్ ఏ తంజావూరు విలేజ్ గ్రంథంలో (1965)బెటీల్ తమిళనాడు తంజావూర్ జిల్లాలోని శ్రీపురం గ్రామంలో పదేళ్ల పరిశోధనపై ఆధారపడి ఉంది. ఈ గ్రంథం భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మైలురాయి.

కులాన్ని కేవలం బ్రాహ్మణ-బ్రాహ్మణేతర దృక్కోణం లో కాకుండా, సమగ్ర సామాజిక స్ట్రాటిఫికేషన్‌లో భాగంగా విశ్లేషించారు. ఆంధ్రే బెటీల్ దృక్పథంలో తెలంగాణ బీసీల రాజ్యాధికార ప్రస్థానం ప్రొఫెసర్ ఆంధ్రే బెటీల్ ‘క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్’ విశ్లేషణను నేటి తెలంగాణ సామాజిక- రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తే, బీసీలు కేవలం ఒక సామాజిక వర్గంగా మిగిలిపోకుండా, ఒక నిర్ణయాత్మక ‘రాజకీయ శక్తి’గా ఎదగాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

శ్రీపురం అధ్యయనంలో బెటీల్ గమనించినట్లుగానే, తెలంగాణలో కూడా ఆచారబద్ధమైన ఆధిపత్యం నుంచి సంఖ్యా బలం ఆధారిత రాజకీయ అధికారం వైపు మార్పు మొదలైంది. ఈ మార్పును రాజ్యాధికారంగా మార్చుకోవడానికి తెలంగాణ బీసీల ముందున్న ఏకైక మార్గం. ఒకప్పుడు కులం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమి తం. కానీ బెటీల్ చెప్పినట్లుగా, ఆధునిక సమాజంలో కులం ఒక ‘ప్రెజర్ గ్రూప్’గా మారింది.

తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, తమ కులాల వారీ వైవిధ్యతను కాపాడుకుంటూనే, రాజ్యాధికారం కోసం ఒకే రాజకీయ గొడుగు కిందకు రావడం చారిత్రక అవసరం. ‘ఓటు మనది సీటు మనది’ అనే నినా దం బెటీల్ చెప్పిన సంఖ్యా బలం  సిద్ధాంతానికి నిదర్శనం. ఆర్థిక అసమానతలకు మూలం వనరుల అసమాన పంపిణీ అని బెటీల్ హెచ్చరించారు.

తెలంగాణలో బీసీలు కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా, విధాన నిర్ణేతలుగా మారినప్పు డే వనరుల పంపిణీలో న్యాయం జరుగుతుంది. సంపద సృష్టించే వర్గాలే ఆ సం పదను పంచుకునే అధికారాన్ని దక్కించుకోవడమే అసలైన సామాజిక ప్రజాస్వా మ్యం. కులం, వర్గం, అధికారం, మూడు ప్రధాన పరి మితుల ప్రకారం, సమాజం లో వ్యక్తి స్థాయిని నిర్ణయించే మూడు స్వతంత్రమైన పరస్పర సంబంధిత అంశాలు:

కులం: పుట్టుక ఆధారంగా వచ్చే ఆచార -విధానాలు, శుద్ధి-అశుద్ధి ఆధారిత సామాజిక స్థానం.

వర్గం: ఆర్థిక స్థితి --- భూమి యాజమాన్యం, ఆదాయం, వృత్తి.

అధికారం : రాజకీయ ప్రభావం, పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం, నిర్ణయాధికారం.

సంప్రదాయ సమాజంలో: ఈ మూడు అంశాలు ఒకే వర్గం (ప్రధానంగా అగ్రకులా లు, బ్రాహ్మణులు) చేతుల్లో కేంద్రీకృతమై ఉండేవి. భూస్వామ్యం, ఆచారిక అధికారం, రాజకీయ నియంత్రణ ఒకటిగా మిళితమయ్యాయి.

ఆధునిక సమాజంలో: ఈ సంబంధం విడిపోయి మారింది. అగ్రకులాలకు చెందిన వ్యక్తి భూమి లేకపోవచ్చు; తక్కువ కులానికి చెందిన వ్యక్తి రాజకీయంగా శక్తివంతుడవ చ్చు. ఇది పవిత్రత ఆధారిత అధికారం నుం చి సంఖ్యా బలం ఆధారిత రాజకీయ అధికారం వైపు మార్పును సూచిస్తుంది.

కుల విభజన నుంచి ఏకీకరణ వైపు..

ఒకప్పుడు కులం మనుషులను విడదీసే సాధనం. ప్రజాస్వామ్యం, సార్వత్రిక ఓటు హక్కు, భూసంస్కరణలు, విద్యా వ్యాప్తి వల్ల అది మారింది. బెటీల్ మాటల్లో: “కులం ఇప్పటికీ ఉంది, కానీ అది పనిచేసే విధానం మారింది. ఒకప్పుడు విడదీసేది, ఇప్పుడు రాజకీయాల కోసం ఏకం చేస్తోంది”. కుల సంఘాలు ప్రెజర్ గ్రూపులుగా మారాయి. రిజర్వేషన్లు, రాజకీయ టికెట్లు, బడ్జెట్ కేటాయింపుల కోసం కులం రాజకీయ ఆయుధం గా మారింది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బీసీలు తమ సంఖ్యా బలంతో అధికారం డిమాండ్ చేస్తున్నారు.

కుల గణన, బీసీ సబ్-ప్లాన్ వంటి డిమాండ్లు ఇందుకు ఉదాహరణ.శ్రీపురం అధ్యయనంలో బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గి, నాన్-బ్రాహ్మణు లు, అది-ద్రావిడులు విద్య, రాజకీయాల్లో ముందుకు వచ్చినట్లు బెటీల్ గమనించారు. ఆర్థిక అసమానతలు, వనరుల పంపిణీ, ఆర్థిక అసమానతలకు మూలం వనరుల (ముఖ్యంగా భూమి) అసమాన పంపిణీ. భూస్వామ్య వ్యవస్థ వల్ల వెనుకబడిన వర్గాలు యజమానులుగా ఎదగలేకపోయాయి. సంపద సృష్టించేవారు ఒక వర్గం, దాన్ని అనుభవించేవారు మరో వర్గం --- ఇది సామాజిక అన్యాయానికి నిదర్శనం.

రాజకీయ అధికారమే ఆయుధం..

రాజ్యాంగం సమానత్వం చెబుతుంది కానీ వాస్తవ జీవితంలో అసమానత కొనసాగుతోంది. ఈ వ్యత్యాసం సామాజిక ఉద్యమాలకు ఆధారం. ఓటు హక్కు శక్తివంతమైన సాధనం. ప్రాతినిధ్యం జనా భా ప్రాతిపదికన ఉండాలి. ‘మెరిట్’ పేరు తో అసమానతలను సమర్థించడం తప్పు అ ని బెటీల్ అభిప్రాయపడ్డారు. ‘దుష్టశక్తులు’ బెటీల్ హెచ్చరిక బెటీల్ సామాజిక న్యాయా న్ని దెబ్బతీసే అవినీతి, అధికార దుర్వినియోగం సమానత్వం పేరుతో వివక్ష కొన సాగించడంను దుష్టశక్తులుగా గుర్తించింది.

ద్య, న్యాయ వ్యవస్థల బలహీనతమనుషుల్లో అసూయ, ద్వేషం వంటి గుణాలు ఆయన కుల గణనను వ్యతిరేకించారు. ఇది కుల విభజనలను మరింత గట్టిపరుస్తుందని హెచ్చరించారు. కుల రాజకీయాలు తాత్కాలికంగా వర్గ రాజకీయాలను భర్తీ చేస్తు న్నాయన్నారు. బెటీల్ సూచించినట్లుగా, సం స్థలు బలహీనపడటం సామాజిక న్యాయానికి ముప్పు. అందుకే, బీసీలు తమ అస్తిత్వా న్ని కాపాడుకుంటూనే, విద్యావంతులైన యువతను రాజకీయాల్లోకి పంపడం ద్వారా వ్యవస్థలను లోపలి నుండి మార్చాలి. ‘మెరిట్’ సాకుతో జరిగే వివక్షను అడ్డుకోవడాని కి రాజకీయ అధికారమే ఏకైక ఆయుధం.

ఆంధ్రే బెటీల్ విశ్లేషించినట్లు, అసమానత అనేది దైవికం కాదు, అది వ్యవస్థ సృష్టించింది. ఆ వ్యవస్థను మార్చే శక్తి “ఐక్యత”లో ఉంది.ఆంధ్రే బెటీల్ విశ్లేషణ మనకు కీలక సందేశం ఇస్తుంది: కులం అంతరించిపోలేదు, కానీ దాని స్వరూపం మారింది. ఇక అది కేవలం విభజన సాధనం కాదు. రాజకీయ చైతన్యం, హక్కుల సాధనకు శక్తిగా మారింది. సామాజిక న్యాయం సాధించాలంటే: వనరుల సమాన పంపిణీ

విద్యా, సంస్థల బలోపేతంకులాల వారీ గా విడిపోకుండా వెనుకబడిన వర్గాలు (ముఖ్యంగా బీసీలు) ఏకం కావడం.రాజకీయ అవగాహన పెంపొందించుకోవడం --- “మనమే పాలకులం” అనే స్పృహ, అసమానత దైవికం కాదు, వ్యవస్థ సృష్టించింది. ఆ వ్యవస్థను మార్చే శక్తి కూడా సమాజం చేతుల్లోనే ఉంది. బెటీల్ రచనలు ఈ మార్పును సాధించడానికి బలమైన సైద్ధాంతిక ఆధారం అంది స్తాయి.

తెలంగాణలో బీసీలు తమ కుల అస్తిత్వాల నుండి ఒకే రాజకీయ శక్తిగా రూపాం తరం చెందినప్పుడు, “మనమే పాలకులం” అనే బెటీల్ స్ఫూర్తితో కూడిన కల సాకారమవుతుంది. అప్పుడే అస్తిత్వం నుంచి అధికారం వైపు సాగే ప్రయాణం సంపూర్ణమవుతుంది. సామాజిక న్యాయం అనేది కేవలం చట్టం ద్వారా వచ్చేది కాదు, అది బాధితులు ఐక్య మై సాధించుకునే ‘అధికారం’ ద్వారా మాత్రమే సాధ్యం.

 వ్యాసకర్త: 91775 66741