16 July, 2026 | 8:48 AM

రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు కృషి

24-06-2024 12:05 AM
  1. మంత్రి శ్రీధర్ బాబు

ఎస్సార్ నగర్‌లో జయంతి సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి ప్రారంభం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎస్సార్ నగర్‌లోని జయంతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు తక్కువ ధరల్లో వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.