calender_icon.png 29 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెకీల కు గడ్డుకాలం!

29-07-2025 02:17:27 AM

  1. వరుసగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్న టెక్ సంస్థలు 
  2. టీసీఎస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల ఉద్యోగులకు ఉద్వాసన
  3. ఏఐపై పెట్టుబడి, ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో టెక్ సంస్థలు

న్యూఢిల్లీ, జూలై 28: టెక్ ఇంజినీర్లకు గడ్డు పరిస్థితి ఎదురవనుంది. అనేక టెక్ కం పెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నాయి. టీసీఎస్ మొదలుకొని ఇంటెల్, మైక్రోసాఫ్ట్, మెటా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించనున్నట్టు పేర్కొంది. మారుతున్న వ్యాపార అవసరాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ)పై పెట్టుబడి, ఖర్చుల్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణ యం తీసుకుంటున్నట్టు తెలిపాయి. అయితే కొన్ని కంపెనీలు ఈ కోతల సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబు తున్నాయి.

 టీసీఎస్:

భారతీయ అతిపెద్ద టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. దాని వర్క్‌ఫోర్స్‌ను 2 శాతం మేర తగ్గించనుంది. దీనివల్ల టీసీఎస్‌లో 12వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోను న్నారు. ఏఐ ఆధారిత ఉత్పాదకత లా భాలే లేఆఫ్స్‌కు కారణమని కంపెనీ పేర్కొంది.

మైక్రోసాఫ్ట్:

మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది 15వేల మందిని తొలగించింది. దీంతో పాటు సరైన ప్రదర్శన చేయని మరో 2వేల మందికి కూడా కంపెనీ ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదపుగా 80 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. దీంతో ఖర్చు ల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తీసేస్తున్నట్టు తెలిపింది.

ఇంటెల్:

ఇంటెల్ ఈ సంవత్సరంలో దాదాపు 24వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని చూస్తోంది. జర్మనీ, పోలండ్‌కు చెందిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. చిప్ మేకర్ అయిన ఇంటెల్.. ఎన్విడియా నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది.

మెటా:

ఈ ఏడాది ప్రారంభంలోనే మెటా తన వర్క్‌ఫోర్స్ నుంచి 5 శాతం మందిని తొలగించింది. తాజాగా కంపెనీలోని రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగుల లేఆఫ్స్‌ను ప్రకటించింది. వీటితో పాటు జపాన్ టెక్ దిగ్గజం పానాసోనిక్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరింది. ఖర్చులను తగ్గించుకు నేందుకు దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసు కుంది. ఈ కోతల్లో సగం జపాన్‌లోనే ఉండడం గమనార్హం.