23 June, 2026 | 4:58 PM

నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన

22-06-2024 02:23 AM
  • టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా

జొహన్నెస్‌బర్గ్: టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో భారత జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ సౌతాఫ్రికా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజీలాండ్‌లతో సిరీస్‌లు ముగించుకున్న తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా బయల్దేరనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో 4 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్ మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను టీమిండియా 2 గెలుచుకోగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1 ఇరుజట్లు సమంగా నిలిచాయి. సౌతాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.