8 August, 2026 | 1:15 AM

బ్లడీ రోమియోతో రొమాన్స్!

08-08-2026 12:00 AM

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ మూవీలో హీరోయిన్‌గా చేసి సరికొత్త విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో కుర్రకారు గుండె ల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ ఒక్క సక్సెస్‌తో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సెయాన్’ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి ఓ బంపర్ ఆఫర్ పడినట్లు టాక్.

నేచురల్ స్టార్ నాని హీరోగా, విలక్షణ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రోమియో’లో నానికి జోడీగా నటించేందుకు భాగ్యశ్రీ బోర్సేను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. సుజీత్ రాసుకున్న విభిన్నమైన కథ, తన పాత్ర నచ్చడంతో భాగ్యశ్రీ కూడా ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకట్ బోయినపల్లి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాని-సుజీత్ కలయికలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో, ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.