మంథని ప్రాంత ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం
40 ఏండ్లుగా మా కుటుంబానికి మీరు సేవే చేసే అవకాశం కల్పించడం మా అదృష్టం
ముత్తారంలో మాజీ స్పీకర్ శ్రీపాద రావు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మంథని నియోజక వర్గ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యమని, 40 ఏండ్లుగా మా కుటుంబానికి మీరు సేవే చేసే అవకాశం కల్పించడం మా అదృష్టమని ముత్తారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు స్మారకర్థం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.
శుక్రవారం హైదరాబా ద్ కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ముత్తారం జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తో కలిసి శ్రీనుబాబు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి శ్రీపాదరా వు ఆశయాలను కొనసాగించేందుకు మంథ ని ప్రాంత ప్రజలకు నిత్యం సేవ చేయడమే తమ కుటుంబ బాధ్యత అని, బాధలో ఉన్నవారు తమకు ఫోన్ చేస్తే మేము బాధ్యతగా వారికి సేవలు అందించడం మా బాధ్యత అని శ్రీనుబాబు తెలిపారు.
పెద్దపల్లి డిసిపి, గోదావరిఖని ఏసిపి, ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పరి సదానందం, బాలాజీ, జగన్ మోహన్ రావు మండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. వారి సహకారంతోనే పేద ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరంలో అవసరం ఉ న్నవారికి ఆపరేషన్ చేయబడునని, నాణ్యమైన కండ్ల అద్దాలు కూడా ఉచితంగా అంది స్తామన్నారు. ఈ ఉచిత క్యాంపు శనివారం కూడా కొనసాగుతుందని మండలంలోని ప్రతి ఒక్కరు ఈ కంటి వైద్య శిబిరంలో పా ల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీదవారికి ఉచిత సేవలు అందిస్తున్న పుష్పగిరి వైద్య బృందానికి అభినందనలు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్మారకర్థం గ్రామీణ ప్రాంతాల్లోని బీదవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పుష్పగిరి వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందనలు తెలిపారు. ముత్తారంలో ఉచిత వైద్య కంటి శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ శిబిరానికి మొదటి రోజు భారీ స్పందన వచ్చింది దాదాపు 1000 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
డిఎంహెచ్ ఎం ప్రమోద్ కుమార్, ఏసిపి రమేష్, సిఐలు రాజు గౌడ్, ప్రసాద్ రావు, ఎస్‌ఐలు రవికుమార్, శ్రీనివాస్, ముఖ్యఅతిథిగా సందెనవేన మహేందర్ యాదవ్ తో పాటు పుష్పగిరి వైద్య సిబ్బంది, ప్రదీప్, వేణు బృందం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లు అంతటి అన్నయ్య గౌడ్, కోట రాజబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, ఉపాధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, మండల కాంగ్రెస్ నాయకులు తూటి రఫీ, బుచ్చం రావు, సుదాటి సంపత్ రావు, నూనెటి కృష్ణ యాదవ్, తాటిపాముల శంకర్, డాక్టర్ చారి, కోల విజయ్ గౌడ్, మండలంలోని సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




