ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ప్రశంసించిన టీపిసిసి ప్రధాన కార్యదర్శి
మంథని,(విజయక్రాంతి): యూత్ లీడర్ నవీన్ భాయ్ డైనమిక్ లీడర్ అని టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ప్రశంసించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను శ్రీనుబాబు అభినందించారు.
శ్రీపాదరావు జయంతి వేడుకల్లో మంథని నియోజక వర్గం నుంచే కాకుండా, రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొందిన యూత్ నాయకుడు నవీన్ యాదవ్ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అనంతరం శ్రీను బాబును కలిసి అలింగణం చేసుకొని ఒకరికొకరు కాసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తీరును శ్రీనుబాబు వివరించారు.




