14 May, 2026 | 1:42 AM

గ్రామీణ క్రీడాకారులకు ‘కేపీఎల్’ ఒక గొప్ప వేదిక

14-05-2026 12:46 AM

కమాన్పూర్ క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతుల ప్రధానంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

కమాన్పూర్, మే 13 (విజయక్రాంతి): గ్రామీణ క్రీడాకారులకు ’కేపీఎల్’ ఒక గొప్ప వేదిక అని కమాన్పూర్ క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతుల ప్రధానంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.కమాన్పూర్ మండల కేంద్రంలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం నిర్వహించిన కమాన్పూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ముగిసింది.

బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్కు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.ఫైనల్ మ్యాచ్ సందర్భంగా శ్రీను బాబు స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. యువతతో కలిసి కాసేపు సరదాగా గడిపిన ఆయన, క్రీడల పట్ల వారికున్న ఆసక్తిని అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. ఐపీఎల్ తరహాలో గ్రామీణ యువత కోసం క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. పోటీలలో గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నేటి యువత గంజాయి, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీమ్ వర్క్ ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయని, అది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశయాలకు అనుగు ణంగా ఇలాంటి సేవా, క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులను, మల్లేష్ బృందాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా ప్రేమికులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్వర్, యూత్ అధ్యక్షులు రెబల్, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.