18 April, 2026 | 6:32 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మహేష్ గౌడ్ సవాల్

18-04-2026 05:25 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ హిందూ-ముస్లిం వివాదాలు ముందుపెట్టి గెలవాలని బీజేపీ చూస్తోందని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) ఆరోపించారు. జైశ్రీరామ్ అనకుండా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసి గెలవాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని కిషన్ రెడ్డి గెలవాలన్నారు. అభివృద్ది చేశారా? ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.