సీఎం రేవంత్ దక్షిణాది ప్రజలను ఏకం చేశారు: ఎంపీ చామల కిరణ్
- కేంద్రమంత్రిని సీఎం కలిస్తే... హరీశ్ రావు తప్పుపడుతున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి కృషిని హరీశ్ జీర్ణించుకోలేకపోతున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది ప్రజలను ఏకం చేశారు.
- బీజేపీ కుట్రలను విపక్షాలు ఎండగట్టాయి
హైదరాబాద్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుగా బీజేపీ మభ్యపెట్టిందని భువనగిరి ఎంపీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బిల్లును అడ్డుకోవడంతో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయని సూచించారు. బీజేపీ కుట్రలను విపక్షాలు ఎండగట్టాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది ప్రజలను ఏకం చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషిని హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని చామల మండిపడ్డారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం వెళ్లారని వివరించారు. కేంద్రమంత్రిని సీఎం కలిస్తే హరీశ్ రావు తప్పుపడుతున్నారని వెల్లడించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులను కోరారని తెలిపారు. గతంలో హరీశ్ రావు వేరే పార్టీల నేతల ఇళ్లకు వెళ్లలేదా? అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.






