ఆసుపత్రి దారికి అడ్డంగా ట్రాక్టర్
* ఎమర్జెన్సీ రోగుల పరిస్థితేంటి?
* కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంపై పట్టణ ప్రజల ఆగ్రహ
కోదాడ సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపివేయడంపై రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఆసుపత్రికి తీసుకురావాల్సి వస్తే మార్గం ఇలా మూసుకుపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆసుపత్రికి వెళ్లే రహదారిని అడ్డుకోవడం ఏమిటంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు బ్లాక్ చేయడంతో అంబులెన్స్‌లు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి రహదారిపై అడ్డంకిని తొలగించి, ఆసుపత్రికి వెళ్లే మార్గం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.