26 May, 2026 | 1:55 AM

ట్రాక్టర్ బోల్తా ఇంటర్ విద్యార్థి దుర్మరణం

26-05-2026 12:22 AM

కామారెడ్డి, మే 25 (విజయక్రాంతి): కుటుంబ సభ్యులతో కలిసి బీరప్ప దైవ దర్శనం చేసుకుని ట్రాక్ట్ప ఇంటికి తిరిగి వస్తుండగా చెరువు కట్టపై అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం  చెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కురుమ నరసింహులు, కుటుంబంతో కలిసి గ్రామ సమీపంలోని బీరప్ప ఆలయానికి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు వెళ్లారు.

బీరప్ప ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకుని పండగ పూర్తయ్యాక ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్ పై వస్తుండగా పటేల్ చెరువు కట్ట పైనుండి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు అతని భార్య కు, అతని కూతురు శ్రావ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు కూతురు ఇంటర్ చదువుతున్న శ్రావ్య (17) సంవత్సరాలు మృతి చెందింది. ప్రమాదంతో రామారెడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ చదువుతున్న శ్రావ్య మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. అందరూ చల్లగుండాలని దేవుని మొక్కుకున్న నరసింహులు తన కూతురు శ్రావ్య మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.