calender_icon.png 24 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల కొరఢా

24-02-2026 01:27:48 AM

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్నర్ వద్ద వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రధానంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, అస్పష్టంగా ఉన్, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లు, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న43 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వాహన యజమానులపై జరిమానా విధించడంతో పాటు, నిబంధనల ప్రకారం సరైన నంబర్ ప్లేట్లను బిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీమ్ ఉల్లా ఖాన్  తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టమైన నంబర్ ప్లేట్లను కలిగి ఉండాలని తెలిపారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం చట్టరీత్యా నేరమని,  నేరాల నియంత్రణలో నంబర్ ప్లేట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.