calender_icon.png 24 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ జీతాలివ్వాలి

24-02-2026 01:28:09 AM

  1. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలి

డీఎంఓహెచ్‌వో ఎదుట ఆశా వర్కర్ల మెరుపు ధర్నా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మూడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆశావర్కర్లు మెరుపు ధర్నా చేశారు. వందలాది మంది ఆశావర్కర్లు ఒక్కసారిగా డీఎంహెచ్‌వోను ముట్టడించారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చికెళ్లే క్రమంలో ఓ మహిళ స్పృహకోల్పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, అసెంబ్లీ బడ్జెట్‌లో ఆశావర్కర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 పారితోషికా న్ని రాష్ర్టంలో తక్షణమే అమలు చేయాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.