calender_icon.png 24 February, 2026 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఆర్థిక సాయం

24-02-2026 01:26:23 AM

భారత్ సేవా సహకార్ ఫోరమ్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, ఫిబ్రవరి23 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ రిజిస్టర్డ్ ఎన్జీవో భారత్ సేవా సహకార్ ఫోరమ్ (బీఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ఆర్థి క సాయం చేశారు. నాగోల్‌లోని వస్‌ంత్ విహార్ ఏసీ ఫంక్షన్‌హాల్‌లో పంపిణీ చేశారు. ‘ఒక చిన్న విరాళం, ఒకరి జీవితంలో పెద్దమార్పు‘ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరి గింది. విద్యా సహాయం కింద 50 మంది విద్యార్థులకు రూ.3.92లక్షల స్కాలర్‌షిప్స్ అందజేశారు.

8 మంది రోగులకు వైద్య స హాయం రూ.1.30 లక్షలు అందజేశారు. సీఎస్‌ఆర్ కింద నెట్‌క్రాకర్ టెక్నాలజీ సొల్యూ షన్స్  రూ.6.50 లక్షల (వైద్యసాయం) చేశా రు. మొత్తం నిధులు రూ.20.92 లక్షలు పంపిణీ చేశారు. భవిష్యత్ నిధులు బీడీఎల్  రూ.46 లక్షలు, కోల్ ఇండియా రూ.2.25 కోట్లు ప్రక్రియలో ఉన్నాయి. కార్యక్రమంలో న్యాయమూర్తి శివశంకర్‌రావు చైర్మన్, తెలంగాణ రాష్ట్టపోలీసు కంప్లయింట్స్ అథారిటీ, మాజీ హైకోర్టు న్యాయమూర్తి, అమర్‌నాథ్ సారంగుల, బీజేపీ అధికార ప్రతినిధి, రమణ ఈశ్వరగారి తదితరులు పాల్గొన్నారు.