30 March, 2026 | 2:09 AM

విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు

16-02-2025 07:54 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణలోనే రెండో అతిపెద్ద పెద్దగట్టు జాతర(Peddagattu Jathara) సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి వద్ద ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. లింగమంతులస్వామి జాతర వల్ల విజయవాడ - హైదరాబాద్  జాతీయ రహదారి(Vijayawada - Hyderabad National Highway)పై ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను కోదాడ వద్ద నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, నార్కట్ పల్లి మీదుగా, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను బీబీగూడెం మీదుగా అనుమతిస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 19 వరకు కొనసాగుతాయని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.