27 February, 2026 | 1:55 AM

పోక్సో కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలుశిక్ష

27-02-2026 12:24 AM
  1. రెండు వేల. రూపాయల జరిమాన

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): మైనర్ బాలిక పై బలవంతపు వేధింపుల పొక్సో కేసులో ఇద్దరు నిందితులకు నా లుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒ క్కొక్కరికి రెండు వేల రూపాయల. జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.వివరాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను 2021సంవత్సరంలో వరుసకి అన్న అయిన తూర్పటి ప్రవీ ణ్ S/o జానీ అను అతను బలవంతపు వేధింపులకు గురి చేయగా అట్టి విషయంలో ప్రవీణ్ తండ్రి అయిన జానీ నానమ్మ అయిన పొచవ్వ లు ఎవరికైనా చెప్తే చంపే స్తాం అని బాధితులని బెదిరించారు.

ఇట్టి విషయం పై బాధితురాలి యెక్క తల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేయగా దర్యాప్తు అనంతరం అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినాడు. ప్రాసిక్యూషన్ తరపున పి.పి.లు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ వాదించగా, సిఎంఎస్. ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్లు శ్రీ నివాస్,నవీన్ లు కోర్టులో పది మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను ప రిశీలించిన సిరిసిల్ల పొక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ ఇద్దరు నిందుతులు అయినటువం టి తూర్పటి జానీ,

తూర్పటి పొచవ్వకి నాలు గు సంవత్సరల జైలు శిక్ష జరిమానా విధించినట్లు తెలిపారు.తూర్పటి ప్రవీణ్ మైనర్ కా వడం వలన అతని మీద కేసు ప్రస్తుతం జువెనైల్ కోర్టులో నడుస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సమాజంలో నేరం చేసిన ఎవరూ శిక్ష నుండి త ప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మా ర్పు వస్తుందని, పోలిసులు. ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ. న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చే స్తారని సూచించారు.పై కేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్,పెంట శ్రీనివాస్, సిఎంఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు,కోర్ట్ కానిస్టే బుల్ లు నవీన్, శ్రీనివాస్, అప్పటి పోలీస్ అ ధికారులు ఎస్.ఐ వెంకటకృష్ణ,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.