calender_icon.png 31 July, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం

31-07-2025 12:28:42 AM

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి ‘విమల్ కుమార్ రాజ్‌పుత్’ (68) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు బుధవారం ఢిల్లీలో నిర్వహించారు.

‘మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృద యం నుండి ఎప్పటికీ వెళ్లిపోరు. లవ్ యు నాన్న..’ అంటూ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... పాయల్ పోస్టు చేసింది. విషాదం నుంచి పాయల్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖలు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.