1 August, 2026 | 6:59 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

ఉత్తరప్రదేశ్ లడ్డూ ఉత్సవంలో విషాదం

29-01-2025 02:01 AM

వేదిక కూలి ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు

లక్నో, జనవరి 28: ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ కేంద్రంగా ఏటా నిర్వహించే లడ్డూ వేడుకలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. వెదురు బొంగులతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగు రు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మం ది గాయపడ్డారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని ఆంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ మీడియాకు తెలిపారు.  ఘటనపై యూపీ సీ ఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఘట నా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల గురించి అధికారులతో మాట్లాడారు. జైన గురువు ఆదినాథుని నిర్వాణను పురస్కరించుకుని జైన కమ్యూనిటీ గత 30ఏళ్లుగా లడ్డూ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది.