1 August, 2026 | 7:50 PM

Breaking News

రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం   •   పాదాచారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై సూచనలు   •   ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు   •   ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి   •   సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం   •   ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో.   •   ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా   •   ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఇఓ   •   తల్లిపాలు శిశువుకు తల్లి ఇచ్చే తొలి అమూల్యమైన కానుక   •   ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవాలి   •  

చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ

01-08-2026 06:37 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో శనివారం మహిళా గ్రామసభను ఘనంగా నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో మహిళల సంక్షేమం, భద్రత, విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధికారత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వక్తలు పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. అలాగే గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, గ్రామ కార్యదర్శి రూత్త అశోక్, వార్డు సభ్యురాలు పాసం నవ్య, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు