calender_icon.png 11 December, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్‍ప్రదేశ్‍లో విషాదం.. 18 మంది మృతి

07-10-2025 09:05:13 PM

హిమాచల్ ప్రదేశ్‌: హిమాచల్‍ప్రదేశ్‍లోని బిలాస్‌పూర్ జిల్లా(Bilaspur District) బలుఘాట్ సమీపంలో మంగళవారం ఒక ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడింది. ఈ ఘటనలో 18 మంది మరణించగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. బస్సు లోపల చాలా మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై హిమాచల్‍ప్రదేశ్‍ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు(CM Sukhvinder Singh Sukhu) తీవ్ర విచారం వ్యక్తం చేసి, స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతులకు ముఖ్యమంత్రి తన సంతాపాన్ని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశానని ఆయన అన్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాలని, వారి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.