16 April, 2026 | 10:52 AM

గంజాయి తనిఖీల్లో విషాదం..

22-06-2025 07:49 PM

గుండెపోటుతో ఎస్ఓటి కానిస్టేబుల్ మృతి..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గంజాయి తనిఖీల్లో ఎస్ఓటి కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. కుత్బుల్లాపూర్ ఎన్టీఆర్ నగర్ లోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తనిఖీలకు వెళ్లిన బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ ప్రవీణ్(SOT Constable Praveen) గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చింతల్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రి వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుత్బుల్లాపూర్ బాపునగర్ లో కానిస్టేబుల్ ప్రవీణ్ నివాసం ఉండే శ్రీ సాయి భవన్ అపార్ట్మెంట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం పోలీస్ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.