24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం

04-05-2026 03:01 AM

కల్తీ కల్లు తాగి మహిళ మృతి చెందినట్లు దుకాణం ముందు ఆందోళన 

నాగర్ కర్నూల్ మే 3 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని చెంచు కాలనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెంచు మహిళ మంగమ్మ(48) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా ఆమె కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని కల్లు దుకాణం ముందు ట్రాక్టర్లో ఉంచి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

కల్లు దుకాణం యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ఈ సందర్భంగా యజమానిని వెంబడించగా, ప్రాణభయంతో అతను సమీప పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మంగమ్మ మృతికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.