24 August, 2026 | 11:44 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

పరీక్షల వేల ప్రయాణికుల ఇక్కట్లు..!

04-05-2026 03:02 AM

అరకొరా ఆర్టీసీ బస్సులు

నాగర్ కర్నూల్ మే 3 (విజయక్రాంతి)ఓ పక్క పెళ్లిళ్లు, మరోపక్క గురుకులం, నీట్ ప్రవేశ పరీక్షల వేల ఆర్టీసీ అధికారులు ఆయా రూట్లో సరిపడా బస్సులను ఏర్పా టు చేయకపోవడంతో ప్రయాణికులు వి ద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడప డంతో ఒక్కో బస్సు కోసం వందల మంది ప్రయాణికులు ఎగబడుతూ కనిపించారు. నీట్ ప్రవేశ పరీక్షతోపాటు గురుకుల ప్రవేశ పరీక్షలు, అధిక సంఖ్యలో పెళ్లిళ్లు కూడా ఒకే రోజు కలిసి రావడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల వెంట ఎగబడ్డారు.

ఆదివారం సెలవు దినం, మైసమ్మ జాతర వంటివి ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని రూట్లల్లో ఆర్టీసీ బస్సులు నడపకపోయినా ఖాళీగా ఉన్నప్పటికీ పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నన్న భయంతో ప్రయాణించారని ప్రయాణికులు వాపోయారు.