12 July, 2026 | 2:53 AM

వియత్నాంలో విషాదం ఫు క్వాక్ దీవుల వద్ద పడవ బోల్తా 15 మంది మృతి

12-07-2026 01:41 AM
  1. ప్రమాద సమయంలో పడవలో 36 మంది
  2. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు
  3. 10 మంది తమిళనాడు, ఇద్దరు కేరళంకు చెందినవారు
  4. తెలంగాణవాసులు 4౦ మంది సురక్షితం

హనోయి, జూలై 11: వియత్నాంలో విషాదకర ఘటన సంభవించింది. ఆ దేశానికి విహారయాత్రకు వెళ్లిన ౧౫ మంది భారతీయుల ప్రాణాలను పడ వ ప్రమాదం కబళించింది. మృతుల్లో 15 మంది తమిళనాడుకు చెందిన వారు కాగా, మరో ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళంకు చెందిన వారు. మృతుల్లో ౩ మంది పురుషులు కాగా, ఇద్దరు మహిళలు. ఫు క్వాక్ దీవుల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. భారత్ నుంచి తాజాగా 250 మంది భారతీయులు వియత్నాం పర్యటనకు వెళ్లారు.

వీరంతా మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్. వీరిని ‘లావా’ మొబైల్ కంపెనీ వారిని వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. వీరిలో ఏపీ నుంచి 35 మంది కాగా, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. మొత్తం పర్యాటకుల్లో ౩౨ మంది శనివారం ఉదయం ‘హోన్ మే రుట్’ దీవి నుంచి టూరిస్ట్ పడవలో నలుగురు సిబ్బందితో కలిసి ‘గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్’ జలాల్లో అన్రోయ్ పోర్టుకు బయల్దేరారు. పడవ మధ్యాహ్నం ‘ఫు క్వాక్’ దీవికి చేరుకోబోతుండగా, బలమైన అలలు పడవను తాకాయి.

దీంతో కుదుపులకు లోనై పడవ బోల్తాపడింది. ప్రమాదంలో పర్యాటకులంతా గల్లంతయ్యారు. ౧౫ మంది నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన వారు ౧౦ మంది ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, మరో ముగ్గురూ ఏపీకి చెందిన వారున్నారు. ఆన్ థోయ్ బోర్డర్ గార్డ్ స్టేషన్, నౌకాదళం, కోస్ట్ గార్డ్ రీజియన్ రెస్క్యూ సిబ్బంది ౨౧ మందిని సురక్షితంగా కాపాడగలిగారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రాణాలు దక్కించుకున్న వారిలో కడపకు చెందిన నయీం అనే మొబైల్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. పడవ ప్రమాదంపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రాణాలు దక్కించుకుని అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ఇదే ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.