17 April, 2026 | 10:42 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హస్తకళల కేంద్రం సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లు

16-06-2025 10:39 PM

చౌటుప్పల్ (విజయక్రాంతి): భారతీయ ప్రాచీన హస్తకళలు అద్భుతమనీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు(Trainee IAS officers) అన్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం టెక్స్ టైల్ పార్కులోని మినీ క్రాప్స్ హస్తకళల కేంద్రాన్ని ఐదు రాష్ట్రాలకు చెందిన సౌరబ్ శర్మ, సలోని చాబ్రా, హర్ష చౌదరి, కర్లాన్ చిగ్తి యాన్వి, కొయ్యడా ప్రణయ్ కుమార్ లు సందర్శించారు. భారతీయ ప్రాచీన హస్తకళలైనా బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ బాతిక్ ప్రింటింగ్, టై అండ్ డై పద్ధతిలో నూలు వస్త్రాలను తయారు చేసే పద్ధతిని పరిశీలించారు.

తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2024 ట్రైనీ ఐఏఎస్ ల బృందం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణలో తెలంగాణ దర్శన్ లో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలో ఇక్కడికి వచ్చారు.పర్యావరణానికి హాని కలగకుండా నూలుతో తయారైన వస్త్రాలపై, ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో తయారైన వస్త్రాలు ధరించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి సైతం మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ప్రాచీన భారతీయ హస్తకళలకు పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో టెక్స్టైల్ పార్కులో మిమి క్రాఫ్ట్స్ పేరుతో హస్తకళల కేంద్రాన్ని ప్రారంభించామని మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నామని ఈ కేంద్రం వ్యవస్థాపకుడు ఫ్యాషన్ డిజైనర్ కే కృష్ణమూర్తి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర నిర్వాహకురాలు పుష్పలత, మర్రి చెన్నారెడ్డి మానవ వరులు అభివృద్ధి సంస్థ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పెద్ద బోయిన, చేనేత జోలి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రామ్ రెడ్డి, మల్కాపురం పంచాయతీ కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.