గెలువు మార్పుకు నాంధి పలకాలి
- సమాజ వికాసం కోసం ప్రజా ప్రతినిధులు పనిచేయాలి
- శిక్షణా తరగతుల్లో ప్రొ. కోదండరామ్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాస్వామిక పద్దతుల్లో సాధించిన గెలుపు సమాజ మార్పుకు నాంధి వలకాలని ప్రొ. కోదండరామ్ అన్నారు. రాజ్యాంగానికి లోబడి జవాబుదారీ పాలనను అందిస్తూ ప్రజల హక్కులను రక్షించడంతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతకమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పక్షాన గెలుపొందిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉపసర్పంచుల రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం పాల్వంచ సుగుణా గార్డెన్స్లో ప్రారంభమైంది.
సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ గణేష్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన శిక్షణా తరగతుల్లో కోదండ రామ్ మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులకు రాజకీయ దృక్పదంతో పాటు ప్రత్యేక లక్ష్యం ఉండాలని, కమ్యూనిస్టు ప్రజాప్రతినిధుల పనితీరు ఉద్యమాన్ని నిలబెట్టాలని సూచించారు. ఒకప్పుడు ప్రజాప్రభుత్వాలు ఉండేవి కావని, దేవుని అనుగ్రహం ఉన్న వారు మాత్రమే పాలకులు అవుతారని నమ్మేవారని, కానీ రానురానూ వచ్చిన మార్పుతో దేవునితో సంబంధం లేని మానవతా వాదంతో ఒక వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు.
సమస్యల పరిష్కారం కోసం పనిచేసే విధంగా స్థానిక ప్రభుత్వాలు రూపుదిద్దుకున్నాయని కోదడం రామ్ తెలిపారు. మనల్ని మనమే పరిష్కారం కోసం పనిచేసే విధంగా స్థానిక ప్రభుత్వాలు రూపుదిద్దుకున్నాయని కోదడం రామ్ తెలిపారు. మనల్ని మనమే పరిపాలించుకునే విధానంతోపాటు అధికారమార్పిడి కూడా ప్రారంభమైందన్నారు. ఓట్లు వేసే అధికారం రావడం, అన్నింటికీ మించి సర్వజనీన వయోజన ఓటు హక్కుతో మార్పులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పాలన జవాబుదారీతనంతో కూడిందై ఉండాలన్నారు.
కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిచండం ద్వారా ఓ మంచిపాలన అందించొచ్చని ఆయన సూచించారు. ప్రజలను భాగస్వామ్యం చేసే ప్రక్రియలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయయన్నారు. 1992వ సం.లో వచ్చిన 73,74 రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు కొత్త అధికారాలను తీసుకొచ్చిందని, నేరుగా నిధులు రావడంతో పాటు ఎన్నికల నిర్వహణ తప్పని సరైందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీల్లో వ్యత్యాసాలు లేనివిధంగా అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
మార్పు తధ్యమని, 1965వ సం. తర్వాత రైతాంగ ఉధ్యమాల ఫలితంగా ప్రశ్నించే తత్వం ప్రారంభమైందని, ఆదిపత్య దోరణి స్థానే, రాజకీయ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. స్థానికంగా ఎన్నికైన వారు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రధానంగా నిధుల వినియోగంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకు కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలన్నారు. నిధులు, విధుల కు చైతన్యం తోడైతేని సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయన్నారు.
రాజకీయాలే నమన్యగా మారాయి - ప్రొ. హరగోపాల్
రాజకీయమంటే సమాజ సమస్యలను అర్ధం చేసుకుని వరిష్కరించడమని, కానీ ఇప్పుడు రాజకీయమే ఒక సమస్యగా మారిందని ప్రొ. హరగోపాల్ తెలిపారు. సిపిఐ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతుల్లో హర గోపాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరగడం నైతికత లోపించడం తదితర కారణాలతో రాజకీయాలు కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో అధికారం అంటే సమాజం నుంచి పొందడం అని, అలాంటి అధికారాన్ని సమాజాభివృద్ధికి, ప్రజల జీవన విధానంలో మార్పుకు దోహదపడేలా కృషి జరగాలన్నారు.
చైతన్యం ద్వారా మార్పు వస్తుందని, మార్క్స్ చెప్పినట్లుగా సమాజం నిరంతరం మారుతూ ఉంటుందని ఆయన తెలిపారు. మానవసంబంధాల్లో మార్పులు త్వరిత గతిన సంభవిస్తున్నా యని, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం తో మానవ సంబంధాలు బలహీన పడి ఒక ప్రశ్నగా మారుతు న్నాయ న్నారు. ముందుగా మనిషి పరిపూర్ణ మానవునిగా ఎదగడమే గొప్ప మార్పు అని హరగోపాల్ స్పష్టం చేశారు. మనిషి సృష్టించిన సంపద సృష్టించిన వానికి దక్కడం లేదని, వేర్వేరు వ్యక్తుల వద్ద అది కేంద్రీకృతమవు తోందన్నారు. బలప్రయోగం రాజ్యాంగ లక్షణం అని తెలిపారు.
ఈ సమాజం తల్లితండ్రి శిక్షించ లేక పోయినా రాజ్యాంగానికి శిక్షించే అధికారం ఇచ్చిందని ఆయన తెలిపారు. నమాజ మార్పు చైతన్యవంతమైన మనిషితో సమక్రమ మార్గంలో జరుగుతుందని హరగోపాల్ తెలిపారు. ఇప్పుడు స్వార్థమే మనిషిని నడుపుతోందని మానవ సంబంధాలు మానవీయంగా మారకపోతే మరింత ప్రమాదమన్నారు. కమ్యూనిస్టు ప్రతినిధుల ద్వారానే సమాజ మార్పు త్వరిత గతిన సాధ్యమవుతుందని హరగోపాల్ తెలిపారు. కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులకు అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ గౌరవాన్ని ఇనుమడింప జేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
మౌళిక వసతుల కల్పన, ముఖ్యమంగా విద్యావైద్యం, తాగునీరు తదితర విషయాలకు ప్రాధాన్యతనిచ్చి మన తర్వాత కూడా కమ్యూనిస్టు ప్రజాప్రతినిధుల పాలనే బాగుందనిపించేలా పాలన సాగాలన్నారు. ఈ శిక్షణ తరగతులను స్థానిక శాసన సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించగా, సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కే నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు,. మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెడవాడ వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, కర్రె బిక్షపతి, ప్రముఖ వైద్యులు సూర్యదేవర రామ్మోహన్ రావు, రిటైర్డ్ ప్రినిస్పల్ సిద్దులు తదితరులు పాల్గొన్నారు. మునిగడప పద్మ, ఉమ, వాసిరెడ్డి మురళీ తదితరులు స్టీరింగ్ కమిటీగా వ్యవహరించారు.




