30 June, 2026 | 10:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఉపాధ్యాయుల బదిలీలు..

29-06-2024 12:33 AM

పదోన్నతులకు కోర్టు గ్రీన్ సిగ్నల్

షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

రంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ జిల్లాలో నిలిచిన పదోన్నతులు, బదిలీలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ౮ రోజుల్లో  ౩ దశల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నది. మొదటి దశలో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, రెండో దశలో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి, మూడో దశలో ఎస్జీటీలు బదిలీలతోపాటు అప్‌గ్రేడ్ అయిన పండితులు, పీఈటీలకు పదోన్నతులు ఇవ్వనున్నది. 2023 అక్టోబర్‌లో ఆగిపోయిన బదిలీలు పూర్తవుతుండంతో ఉపాధ్యాయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.