30 June, 2026 | 9:08 PM

Breaking News

తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •  

రూ.18 లక్షలతో కారు డ్రైవర్ పరార్

29-06-2024 12:34 AM

జగిత్యాల, జూన్ 28 (విజయక్రాంతి): కారులో ఉంచిన రూ.18 లక్షల డబ్బుతో ఓ డ్రైవర్ ఉడాయించిన ఘటన జగిత్యాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల టౌన్  సీఐ వేణుగోపాల్  కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చైల్‌సింగ్ ఓ ఎలక్ట్రికల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్. రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసి నెలనెలా డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆయన వద్ద దయాసింగ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తునాడు. శుక్రవారం జగిత్యాలకు వచ్చిన చైల్‌సింగ్.. కారును పార్క్ వద్ద ఉంచి అప్పటికే కలెక్షన్ చేసిన రూ.18 లక్షలు డ్రైవర్‌కు ఇచ్చాడు. పట్టణంలో డబ్బుల వసూలు కోసం వెళ్లి వచ్చే సరికి దయాసింగ్ రూ.౧౮ లక్షలతో పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.