1 July, 2026 | 8:09 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

నకిలీ వైద్యురాలితో ట్రీట్‌మెంట్

09-09-2024 12:45 AM

ఇబ్రహీంపట్నం అనిరెడ్డి రామరక్ష ఆసుపత్రిపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కనీస అర్హతలు లేకుండానే రోగులకు చికిత్స చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు నకిలీ వైద్యుల గుట్టురట్టుంది. ఇబ్రహీంపట్నం మండలం మంచాల రోడ్డు లో ఉన్న అనిరెడ్డి రామరక్ష ఆసుపత్రిని నకిలీ డాక్టర్‌తో నడుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్‌ఓటీ బృందం, ఇబ్రహీంపట్నం పోలీసులు కలిసి దాడిచేశారు. దాడుల్లో.. నకిలీ డాక్టర్‌గా చలామని అవుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవళిక అలియాస్ శిరీష ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నకిలీ డాక్టర్‌తో పాటు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.