15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడి దంపతులకు సన్మానం

27-02-2026 09:20 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఇందుర్గాం ఉపాధ్యాయుడు కూచయ్య పదవి విరమణ సందర్భంగా తోటి ఉపాధ్యాయులతో కలిసి మండల విద్యాధికారి డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని మండల విద్యాధికారి సునీత అన్నారు.

ఉపాధ్యాయుడి అనుభవాలను, సమాజ సేవ గురించి పలు విషయాలను తెలిపారు. మారుమూల గ్రామమైనప్పటికీ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు చూపే ప్రేమానురాగం ఎంతగానో నచ్చిందని ఆ గ్రామంలో పనిచేయడం నా అదృష్టమని ఉపాధ్యాయుడు కుచ్చయ్య తెలిపారు. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.