calender_icon.png 16 February, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళి

15-02-2026 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు

ముషీరాబాద్, ఫిబ్రవరి14 (విజయక్రాంతి): పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్దగల రోటరీ క్లబ్ సమీపంలో అమరవీరులకు శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ హేమా జిల్లోజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి అన్సారీ, జాయింట్ ట్రెజరర్ జావిద్, రాష్ట్ర నాయకులు పరీక్షన్ రాజ్, కొడంగల్ శ్రీనివాస్, దర్శనం రమేష్, గోషామహల్ వివేక్, అజీమ్ భేగ్ ముర్తుజా, లియాకత్ ఖాన్, రాకేష్ రెడ్డి, జి ఎస్, ఆర్. అకీబ్, నాయకులు, కార్యకర్తలు, పౌరులు పాల్గొని దీపాలు వెలిగించి, రెండు నిమిషాల మౌనం పాటించారు.

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. దేశ భద్రత, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ, వారి త్యాగానికి గౌరవంగా దేశం ముందుకు సాగాలన్నారు.