14-02-2026 09:19:51 PM
బికె గూడాలో బీజేపీ నాయకుల స్మరణ కార్యక్రమం
సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్‌నగర్ పరిధిలోని బి.కె. గూడా జై భారతి హై స్కూల్ చౌరస్తాలో పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనాన్ని పాటిస్తూ అమరవీరుల త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన దారుణ ఉగ్రదాడి దేశాన్ని కలిచివేసిందని గుర్తుచేశారు.
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగం ఎప్పటికీ మరవలేనిదని, వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల మహేష్, బాల నరసింహ, సుధాకర్ ముదిరాజ్, రాజు, చంద్ర కుమార్, సుమన్ కుమార్, కుశల్, అనిల్ గౌడ్, మిధుల్, దయానంద్, రమేష్, నాగార్జున, ప్రవీన్, శ్రవణ్, రవి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.