15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి

14-02-2026 09:24 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే పదవులను కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్ దేవ్ శనివారం అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ గా ఏర్పడిన నాటి నుండి గత పాలకవర్గంలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులలో బీసీలకు ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పుడైనా బిసి అభ్యర్థులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 60 శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గెలుపులో బిసి వర్గాలు కీలకంగా పనిచేసిన నేపథ్యాన్ని గుర్తించి ఈనెల 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక లలో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.