2 May, 2026 | 4:17 AM

కరుప్పులో ప్రీతిగా త్రిష

02-05-2026 03:10 AM

కోలీవుడ్ స్టార్ సూర్య నుంచి వస్తున్న తాజాచిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభ ద్రుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. దర్శకుడు ఆర్జే బాలాజీ తనదైన మార్కు కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది.

మే 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న త్రిష పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసి, ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. త్రిష ‘ప్రీతి’ అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

ఇందులో ఆమె ముందుగా లాయర్‌గా.. కోర్టు హాల్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే, ఆ తర్వాత సడెన్‌గా చీర కట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. త్రిష ఈ సినిమాలో కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపిస్తోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. సూర్య కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయనుంది.