calender_icon.png 19 February, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు టీఆర్పీ అత్యవసర కార్యవర్గ సమావేశం

19-02-2026 02:43:10 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించను న్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి రాష్ట్రంలోని కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నిక లపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

అలాగే రాబోయే ఎంపిటిసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎలా అడుగులు వేయాలో అనే అంశంపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుం చి రాష్ట్ర స్థాయి వరకు సంఘటితంగా పనిచేసే విధానంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.పార్టీ భవిష్యత్ కార్యా చరణ, ఎన్నికల వ్యూహం, నాయకుల బాధ్యతలపై పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.