ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి
ప్రధానోపాధ్యాయురాలు రాధిక
వెంకటాపూర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని ప్రధానోపాధ్యాయురాలు రాధిక అన్నారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాలీ చేపట్టారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అని, డబ్బులు ఎందుకు దండగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మన ఊరు మన బడి, బడి మనదే బాధ్యత మనదే వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు, అవసరమైన సౌకర్యాలు అందుబా టులో ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతా యని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని రాధిక కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, ఫెరోజ్, సంధ్యారాణి, కిషోర్, చెన్నకేశవరావు, స్వప్న, సుమలత, సీఆర్పీ కుమార్ పాడ్య, విద్యార్థులు పాల్గొన్నారు.






